కాశీకి తెలుగు ప్రజలకు మధ్య ప్రాచీన సంబంధం ఉంది: మోదీ

Kashi Telugu Sangamam Ganga Pushkar Aaradhana PM Modi Address - Sakshi

లక్నో: శనివారం సాయంత్రం కాశీలో తెలుగు సంగమం - గంగా పుష్కర ఆరాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ కాశీ తెలుగు సమితి గౌరవాధ్యక్షులు, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు  నేతృత్వం వహించారు. కాశీ తెలుగు సంగమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. 

'కాశీకి తెలుగు ప్రజలకు మధ్య ప్రాచీన సంబంధం ఉంది. ఏపీ, తెలంగాణ భక్తులు అత్యంత ఆరాధన భావంతో ఉంటారు. తెలంగ్ స్వామిని కాశీలో నడుస్తున్న మహాశివుడు గా అభివర్ణిస్తారు. జిడ్డు కృష్ణమూర్తినీ ప్రజలు గుర్తుంచుకున్నారు. వేములవాడను దక్షిణ కాశీగా అభివర్ణిస్తారు. కాశీ మజిలీ కథలు తెలుగు ప్రజలతో మమేకమై ఉన్నాయి. ఇదంతా తరతరాలుగా భారత వారసత్వం. కాశీని ఎంతో అభివృద్ధి చేస్తున్నాం. వారణాసి - బెనారస్ మధ్య రోప్ వే నిర్మిస్తున్నాం. ఏపీలో ఏటి కొప్పాక బొమ్మలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. గంగా పుష్కరాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు' అని మోదీ పేర్కొన్నారు.

ఈ కర్యక్రమంలో నిర్వహించినవి..
 ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనం.

 వేద పండితుల ఆశీర్వచనం, వేదపారాయణం, స్త్రోత్ర పారాయణం.

 మానస సరోవర్ ఘాట్ వద్ద  గంగా నదీ ఆరాధన,  గంగా హారతి.
చదవండి: సోలో సెయిలింగ్‌ రేస్‌లో చరిత్ర సృష్టించిన భారత ఇండియన్‌ నేవీ ఆఫీసర్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top