ఎమ్మెల్యే కారు డ్రైవర్‌ నిర్బంధం | Karthik Purohit Arrested in Darshan | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కారు డ్రైవర్‌ నిర్బంధం

Jul 9 2024 6:26 AM | Updated on Jul 9 2024 6:26 AM

Karthik Purohit Arrested in Darshan

    రేణుకాస్వామి హత్య కేసు...  

యశవంతపుర: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు కార్తీక్‌ పురోహిత్‌ అనే మరో నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని సోమవారం విచారించారు. 

గత శనివారం కూడా నాలుగైదు గంటల పాటు ప్రశ్నించినట్లు తెలిసింది. ఓ ఎమ్మెల్యే కారు డ్రైవర్‌గా పని చేస్తున్న కార్తీక్‌ పురోహిత్, రేణుకాస్వామి మృతదేహాన్ని  పారేసిన తరువాత నిందితుడు ప్రదోశ్‌ను అక్కడ నుంచి తీసుకెళ్లినట్లు విచారణలో బయట పడింది. తన కారులోనే ప్రదోశ్‌ను గిరినగరకు తీసుకెళ్లాడు. ఆ రోజు ఏమి జరిగిందనేది కార్తీక్‌ నుంచి పోలీసులు వివరాలను సేకరించారు.   

పవిత్ర స్నేహితురాలు సమత విచారణ  
పవిత్రగౌడ ఆప్త స్నేహితురాలు సమతను ఈ  కేసులో పోలీసులు విచారించారు. నిందితుడు ధనరాజ్‌కు ఆమె రూ. 3 వేలు పంపిన అధారాలను సేకరించారు. 

ఈ డబ్బులతో ధనరాజ్‌ ఎలక్ట్రిక్‌ షాక్‌ పరికరాన్ని కొన్నట్లు అనుమానిస్తున్నారు. బసవేశ్వరనగర ఠాణాలో సమతను ప్రశ్నించారు. మరోవైపు దర్శన్, పవిత్రతో పాటు 17 మంది నిందితులు జైళ్లలో కస్టడీలో ఉన్నారు. దర్శన్‌ బెయిలు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement