ఐదేళ్లకు లక్ష్మీదేవీ తలుపు తట్టింది.. కొన్ని రోజుల్లో ఆయన లక్షాధికారి!

Karnataka Farmer Earns More Profit This Year On Tomato Crop - Sakshi

చిక్కబళ్లాపురం(బెంగళూరు): ప్రస్తుతం భారత్‌లో గత కొన్ని రోజులుగా ట్రెండింగ్‌లో ఏదైనా ఉందా అంటే అది టమోటా అనే చెప్పాలి. కొనగోలుదారులకు చుక్కలు చూపిస్తూ, రైతులకు కనక వర్షం కురిపిస్తోంది. ఇక దొంగలు కూడా బంగారం, డబ్బులు వదిలేసి టమోటాలపై పడ్డారు.  కర్ణాటకలో ఓ రైతు  ఏళ్లుగా సాగు చేసినా ఏనాడు కాసింత లాభాలు కూడా మిగల్చని టమాట పంటనే ఈ పర్యాయం ఆయనపై ధనవర్షం కురిపించనుంది.

కొన్ని రోజుల్లో లక్ష్మీదేవి అతని ఇంటి తలుపులు తట్టనుంది. అసలు కథ ఏంటంటే.. చిక్కబళ్లాపురం తాలూకా పట్రేనహళ్లికి చెందిన రైతు దేవరాజు ఐదేళ్లుగా టమాట పంట సాగు చేస్తున్నాడు. పంట కోతకు వచ్చినప్పుడల్లా ధరలు నేలచూపు చూశాయి. దీంతో పెట్టుబడులు కూడా దక్కేవి కాదు. అయినప్పటికీ దేవరాజు టమాట సాగు చేయడం మానలేదు. ఈ ఏడాది అర ఎకరాలో సాగు చేయగా ప్రస్తుతం నిండుపూతతో ఉంది.

కొద్ది రోజుల్లో పంట కోతకు రానుంది. అర ఎకరాకు రూ.లక్షా50వేలు వ్యయం చేశాడు. ప్రస్తుతం కిలో టమాట ధర 120 పలుకుతోంది. పది రోజుల వరకు ఇవే ధరలు కొనసాగితే రూ.9 నుంచి రూ.10లక్షల వరకు ఆదాయం వస్తుందని దేవరాజు ధీమాతో ఉన్నాడు. పంటకు తెగుళ్లు, చీడ పీడలు ఆశించాయని, మందులు పిచికారీ చేసి జాగ్రత్తగా కాపాడుకుంటున్నట్లు రైతు దేవరాజు తెలిపాడు.

చదవండి: అదే పనిగా భర్తకు నైట్‌ షిఫ్ట్‌.. కోపంతో భార్య.. రాత్రి మాస్క్‌ వేసుకుని ఇంట్లోకి దూరి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top