కర్ణాటక కేబినెట్‌ భేటీ.. 5 గ్యారంటీ హామీల అమలుకు గ్రీన్‌ సిగ్నల్‌

Karnataka CM Siddaramaiah Cabinet Approves Five Poll guarantees - Sakshi

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన 5 గ్యారంటీ పథకాల అమలుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ తెలిపింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో శుక్రవారం జరిగిన కర్ణాటక కేబినెట్‌ భేటీలో వీటికి ఆమోదం లభించింది. అధికారులు అందించిన ప్రజెంటేషన్‌ల ఆధారంగా మంత్రి మండలితో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే 5 గ్యారంటీ స్కీమ్‌ను అమలు చేయనునట్లు ప్రకటించారు

కుల, మత వివక్ష లేకుండా ఐదు హామీలను అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు సమావేశం అనంతరం సిద్ధరామయ్య వెల్లడించారు. ప్రజలకిచ్చిన ఇతర హామీలను కూడా కచ్చితంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. వీటి అమలుకు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఏడాదికి 50 వేల కోట్ల భారం పడనుంది.

కాగా ఎన్నికలప్పుడు కాంగ్రెస్‌ అయిదు గ్యారంటీలను ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 5 వాగ్దానాలను ఒకేసారి నెరవేర్చుతామని చేసింది. అనుకున్నట్టేగానే 224 స్థానాలున్న అసెంబ్లీలో 135 చోట్ల కాంగ్రెస్‌ విజయకేతనం ఎగరవేసింది. ఏ పార్టీతో పొత్తులేకుండా సింగిల్‌గానే మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఇచ్చిన మాట ప్రకారం నేటి కేబినెట్‌ భేటీలో ఆ 5 గ్యారంటీ వాగ్దానాలకు ఆమోదముద్ర వేసింది.
చదవండి: బ్రిజ్‌ భూషణ్‌పై సంచలన నిందారోపణలు

కాంగ్రెస్‌ ప్రకటించిన 5 హామీలు ఇవే..
1. గృహ జ్యోతి(ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌),
2. గృహ లక్ష్మి(ప్రతి కుటుంబానికి చెందిన మహిళకు నెలకు రూ.2000)
3. అన్న భాగ్య( బిపిఎల్ న కుటుంబంలోని ప్రతి సభ్యునికి 10 కిలోల ఉచిత బియ్యం, 
4. యువ నిధి (నిరుద్యోగ గ్రాడ్యుయేట్‌కు నెలకు రూ. 3,000, నిరుద్యోగ డిప్లొమా చేసిన వారికి రూ. 1,500 చొప్పున ఇవ్వనున్నారు. 18-25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి రెండేళ్లపాటు అందించనున్నారు.
5. శక్తి (పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం).

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top