
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరో ఘాతుకానికి ఒడిగట్టారు. బీజాపూర్ జిల్లాలోని ఉట్లూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ప్రమాదంలో ఒక జవాన్ మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్ర గాయపడ్డారు. దీంతో, హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, భద్రతా బలగాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు.