‘జామియా’లో దీపావళి ఉద్రిక్తత | Jamia University Clash Between Two Groups | Sakshi
Sakshi News home page

‘జామియా’లో దీపావళి ఉద్రిక్తత

Oct 23 2024 6:57 AM | Updated on Oct 23 2024 6:57 AM

Jamia University Clash Between Two Groups

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని జామియా యూనివర్సిటీలో  ఉద్రిక్తత నెలకొంది. దీపావళి వేడుకల సందర్భంగా రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం యూనివర్శిటీకి చెందిన కొందరు హిందూ విద్యార్థులు దీపావళి వేడుకలకు ముందుగా దీపాలు వెలిగించారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన మరోవర్గానికి చెందినవారు నిరసనకు దిగారు. అనంతరం ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ నేపధ్యంలో యూనివర్సిటీ క్యాంపస్‌లో పోలీసు భద్రతను మరింతగా పెంచారు. జామియా యూనివర్సిటీలో దీపావళి వేడుకల  సందర్భంగా వెలిగించిన దీపాలను పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యూనివర్శిటీలో మతపరమైన నినాదాలు వినిపించినట్లు పోలీసులు తెలిపారు. 

 



ఇది కూడా చదవండి: కొనసాగుతున్న బాంబు బెదిరింపులు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement