దళిత కార్యకర్త ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ చేసిన కేంద్ర మంత్రి జైశంకర్ | Jaishankar Eats Breakfast At Dalit BJP Worker Home At G20 Meeting In Varanasi | Sakshi
Sakshi News home page

దళిత కార్యకర్త ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ చేసిన కేంద్ర మంత్రి జైశంకర్

Jun 11 2023 6:37 PM | Updated on Jun 11 2023 6:48 PM

Jaishankar Eats Breakfast At Dalit BJP Worker Home At G20 Meeting In Varanasi - Sakshi

వారణాసి: ఈ ఏడాది జీ-20 సమావేశం మన దేశంలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 11(ఆదివారం) నుంచి 13వ తేదీ వరకు వారణాసిలో జీ-20 మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇందుకు విదేశాంగ మంత్రి జై శంకర్ అధ్యక్షత బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు జీ-20 సమావేశాల్లో పాల్గొన్న జైశంకర్ ఓ దళిత వ్యక్తి(బీజేపీ బూత్ అధ్యక్షుడు) ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ చేశారు.

మంత్రి రాకకోసం ఒకరోజు ముందు నుంచే ఏర్పాట్లు చేసినట్లు బీజేపీ బూత్ ప్రెసిడెంట్ సుజాత చెప్పారు.'మా కుటుంబమంతా ఆ ఏర్పాట్లలో ఉన్నాం. ఇళ్లు శుభ్రం చేసి కచోరి,ఆలూ పన్నీర్ వండిపెట్టాము. కేంద్ర మంత్రి మా ఇంట్లో తినడం మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది'అని ఆమె అన్నారు. తమ లాంటి పేదవాళ్ల ఇంట్లో కేంద్ర మంత్రి వచ్చి తినడం చాలా ఆనందాన్ని కలిగించిందని సుజాత మామయ్య చెప్పారు.

తిన్న అనంతరం భోజనం చాలా బాగుందని జైశంకర్ చెప్పారు. ఆహార భద్రత,ధాన్యం, ఫర్టిలైజర్స్, చిరుధాన్యాల గురించే ఈ రోజు సమావేశంలో చర్చ జరగనుందని చెప్పారు. వీడియో కాన్ఫరెన్సులో ప్రధాని మోదీ కూడా ఇందులో పాలుపంచుకోనున్నారని వెల్లడించారు.  

ఇదీ చదవండి:భారతీయ స్ట్రీట్ ఫుడ్ రుచికి జపాన్ జంట ఫిదా..  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement