Ratna Bhandar: తెరిచి ఉన్న చెక్క పెట్టెలు! | Puri Jagannath Temple Ratna Bhandar Boxes Locks Opened, More Details Inside | Sakshi
Sakshi News home page

Ratna Bhandar: తెరిచి ఉన్న చెక్క పెట్టెలు!

Jul 27 2024 9:20 AM | Updated on Jul 27 2024 10:04 AM

Jagannath temple Ratna Bhandar boxes Locks opened

భువనేశ్వర్‌: పూరీ శ్రీమందిరం రత్న భాండాగారం స్థితిగతుల పట్ల సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రత్న భాండాగారం ఉన్నత స్థాయి తనిఖీ పర్యవేక్షణ కమిటీ అధ్యక్షుడు జస్టిస్‌ విశ్వనాథ్‌ రథ్‌ తాజా ప్రకటన మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. 

రత్న భాండాగారం లోపలి గదిలో ఓ ఇనుప పెట్టె ఉంది. దీనికి 2 తాళాలు వేసేందుకు సదుపాయం ఉంది. ఒక తాళం సరిగ్గా ఉండగా, మరొకటి వదులుగా వేలాడుతుందని పేర్కొన్నారు. అలాగే మరో 2 చెక్క పెట్టెలు తాళాలు లేకుండా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. 1978లో రత్న భాండాగారంలోకి ప్రవేశించిన వారు ఇలా తాళాలు వేయకుండా బయటకు వచ్చారని తాను నమ్మలేకపోతున్నానని రథ్‌ పేర్కొనడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement