ముగిసిన ఈడీ డైరెక్టర్‌ పదవీకాలం | IRS officer Rahul Navin appointed in-charge ED director as Sanjay Kumar mishra | Sakshi
Sakshi News home page

ముగిసిన ఈడీ డైరెక్టర్‌ పదవీకాలం

Sep 16 2023 5:18 AM | Updated on Sep 16 2023 9:05 AM

IRS officer Rahul Navin appointed in-charge ED director as Sanjay Kumar mishra - Sakshi

న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టర్‌గా సంజయ్‌కుమార్‌ మిశ్రా పదవీకాలం శుక్రవారం ముగిసింది. ఆయన స్థానంలో రాహుల్‌ నవీన్‌ను ఇంఛార్జి డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 1993 ఐఆర్‌ఎస్‌ ఆఫీసర్‌ అయిన రాహుల్‌ నవీన్‌ ఈడీకి రెగ్యులర్‌ డైరెక్టర్‌ నియమితులయ్యే దాకా పదవిలో కొనసాగుతారని వెల్లడించింది.

రాహుల్‌ నవీన్‌ ప్రస్తుతం ఈడీలోనే స్పెషల్‌ డైరెక్టర్‌ హోదాలో కొనసాగుతున్నారు. సంజయ్‌కుమార్‌ మిశ్రాకు గతంలో రెండు పర్యాయాలు కేంద్ర ప్రభుత్వం ఏడాది చొప్పున పొడగింపు ఇవ్వగా సుప్రీంకోర్టు తప్పుపట్టిన విషయం తెలిసిందే. మరోసారి పొడగింపు కుదరదని తేల్చిచెబుతూ సెప్టెంబరు 15 దాకా గడువుచ్చింది. అది పూర్తి కావడంతో శుక్రవారం రాహుల్‌ నవీన్‌ను ఇంఛార్జిగా నియమిస్తూ కేంద్రం ఆదేశాలు వెలువరించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement