ఇన్‌స్టా వీడియో కోసం నడిరోడ్డుపై యువతి డ్యాన్స్‌.. చివరికి

Indore Woman In Trouble For Dancing At Traffic Signal - Sakshi

భోపాల్‌: తక్కువ కాలంలో పాపులారిటీని సంపాదించాలని అనేకమంది ఆరాటపడుతుంటారు. ఇందుకోసం ఎంతకైనా తెగించి రిస్క్‌ తీసకుంటారు. కొన్నిసార్లు చేయరాని పనులు చేసి ఇబ్బందులను కొనితెచ్చుకుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే తాజాగా చోటుచేసుకుంది. ఫేమస్‌ అవ్వడం కోసం ఓ యువతి రోడ్డుపై రెచ్చిపోయి చిందులేసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. రసోమా స్క్వేర్‌లో శ్రేయా కల్రా అనే యువతి మూడు రోజులక్రితం రద్దీగా ఉండే రోడ్డు మీద డ్యాన్స్‌ చేసింది. రెడ్‌ సిగ్నల్‌ పడటంతో హఠాత్తుగా రోడ్డు మీదకొచ్చి, ముఖానికి మాస్క్‌ వేసుకొని స్టెప్పులేసింది.

ట్రాఫిక్‌ సిగ్నల్‌వద్ద వేచి ఉన్న ప్రయాణికులు ఆమె డ్యాన్స్‌ చూసి ఆశ్చర్చపోయారు. అయితే యువతి తన ఇన్‌స్టాగ్రామ్‌ కోసం చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే ఈ వీడియో ప్రస్తుతం యువతిని చిక్కుల్లో పడేసింది. ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించినందుకు పోలీసులు ఆమెకు నోటీసులు జారీచేశారు. అంతేగాక నెటిజన్లు సైతం యువతిపై మండిపడుతున్నారు. వాహనదారులకు ఇబ్బంది కలిగించేలా నడిరోడ్డు మీద గంతులేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: తాఫీగా షాపులోకి వెళ్లాడు.. వాటిని చూడగానే భయంతో లగెత్తాడు..
నాకు లవర్‌ను వెతికి పెట్టండి: ఎమ్మెల్యేకు యువకుడి లేఖ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top