నేను మంచోడిని.. లవర్‌ను వెతికి పెట్టండి: ఎమ్మెల్యేకు యువకుడి లేఖ

Young Man Wrote A Letter To MLA For Lover In Maharastra - Sakshi

ఎవరూ ప్రేమించడం లేదని ఆవేదన

తనను ప్రేమించేలా అమ్మాయిలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి

ముంబై: ప్రజాప్రతినిధులకు సమస్యలపై విజ్ఞప్తి చేయడం చూస్తుంటాం. కానీ ఓ యువకుడు మాత్రం తన నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు తనకు ప్రేయసి (గర్ల్‌ఫ్రెండ్‌)ను ఏర్పాటు చేయాలని లేఖ రాశాడు. ఆ లేఖ ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ‘నేను మంచోడిని.. నన్నెవరు పట్టించుకోవడం లేదు.. మీ నియోజకవర్గ అమ్మాయిలను ప్రేమించేలా ప్రోత్సహించండి’ ఆ యువకుడు లేఖ రాశాడు. అయితే ఆ లేఖ ఎవరూ రాశారో కనుక్కుంటే విస్తుగొల్పే నిజం తెలిసింది.
చదవండి: మంత్రి కేటీఆర్ మత్తులో ఉండి ట్వీట్ చేశారా?: రేవంత్‌రెడ్డి

మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లాలోని రాజూరా ఎమ్మెల్యే సుభాశ్‌ ధొతేకు ఇటీవల ఓ లేఖ వచ్చింది. మరాఠీలో రాసిన ఆ లేఖ భూషణ్‌ జాంబవంత్‌ రాఠోడ్‌ పేరిట వచ్చింది. ఆ లేఖ తెరచి చూడగా.. ‘మన ప్రాంతంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఏ అమ్మాయి కూడా నాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. గద్‌చందూర్‌ నుంచి రాజురా మధ్య నిత్యం ప్రయాణిస్తుంటా. భవిష్యత్‌లో నాకు ప్రేయసి దొరుకుతుందనే నమ్మకం నాకు లేదు. తాగుబోతులకు తప్ప ఎలాంటి చెడు అలవాట్లు లేని నాలాంటివారికి ప్రేయసి దొరకడం లేదు. దయచేసి మీ నియోజకవర్గంలో ఉన్న అమ్మాయిలను ప్రోత్సహించండి’ అంటూ ఆ లేఖలో ఎమ్మెల్యేకు సూచిస్తూ పంపాడు. ఆ లేఖను చూసిన ఎమ్మెల్యే వెంటనే ఆరా తీశారు.
చదవండి: లవ్‌ ఫెయిలైన యువకుడి ప్రాణం నిలిపిన ఫేస్‌బుక్‌

భూషణ్‌ జాంబవంత్‌ రాఠోడ్‌ పేరుగల వారిని ఆరా తీయగా అలాంటి పేరుతో ఉన్నవారెవరూ లేరు. వైరల్‌గా మారడానికి ఇలా లేఖ రాశారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ లేఖపై సోషల్‌ మీడియా ఫన్నీగా స్పందిస్తోంది. నీదే కాదు బ్రదర్‌ నా పరిస్థితి అంతే అంటూ సింగిల్‌ కింగ్‌లు పేర్కొంటున్నారు. ఫన్నీ మీమ్స్‌, కామెంట్లు వస్తున్నాయి. ఇలాంటి లేఖ రావడం ఇదే మొదటిసారిని ఎమ్మెల్యే పేర్కొన్నాడు. ఆ అబ్బాయి ఎవరో తెలిస్తే అతడికి కౌన్సిలింగ్‌ ఇస్తామని ఎమ్మెల్యే సుభాష్‌ చెప్పాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top