తాపీగా షాపులోకి వెళ్లాడు.. వాటిని చూడగానే భయంతో లగెత్తాడు..

Boy Suddenly Shocked See Snake Attack Chased Rat Pan Shop Goes Viral - Sakshi

సోషల్‌మీడియా వాడకం పెరిగిన తర్వాత ఇంటర్నెట్‌లో రకరకాల వీడియోలు దర్శనమిస్తున్నాయి. వాటిలో కొన్ని వైరల్‌గా మారి హల్‌చల్‌ చేస్తుంటాయ్‌ కూడా. ఆ జాబితాలో కొన్ని మనల్ని నవ్విస్తే , కొన్ని కోపం తెప్పిస్తాయ్‌, మరికొన్ని భయపెడతుంటాయ్‌. సరిగ్గా ఇదే తరహాలోనే ఉన్న ఈ వీడియోను చూస్తే మనకి భయం వేయక మానదు. షాపులోకి వెళ్లిన ఓ యువకుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి బయటకు పరగు తీసాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

ఆ వీడియోలో.. షాపులోకి ఓ కుర్రాడు మొబైల్ చూసుకుంటూ ప్రవేశిస్తాడు. రోజూలానే షాపులో అలా కూర్చుందామనుకున్నాడో లేదో ఒక్కసారిగా షాప్‌ పైభాగంలో కనిపించిన దృశ్యం చూసి అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. ఎందుకంటే.. ఓ పెద్ద పాము ఎలుకను పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ దాని వెంటపడుతోంది. ఆ ఎలుక ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆ రెండు తన వైపే వస్తున్నట్లు గమనించిన ఆ యువకుడి భయమే అతన్ని రన్నింగ్ చేయించింది.

ఆ కుర్రాడు దూరంగా వెళ్లిపోయాక... పాము ఎలుకను చాలాసేపు వెంటాడింది. ఓసారి షాపులోంచి బయటకు వెళ్లిన పాము... మళ్లీ ఎలుకను వెంబడిస్తూ షాపులోకి దూరింది. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో ఈ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు.. అదృష్టవశాత్తు ఆ కుర్రాడు పాము కాటు నుంచి తప్పించుకున్నాడంటూ కొందరు.. లక్కీ బాయ్‌ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

చదవండి: 
వైరల్‌: వివాహం అయ్యాక.. వధువు కాళ్ల మీద పడ్డ వరుడు
వైరల్‌: ‘లారీకి దెయ్యం పట్టిందా? రెండుగా విడిపోయినా ఏంటా పరుగు’

                 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top