వైరల్‌: వివాహం అయ్యాక.. వధువు కాళ్ల మీద పడ్డ వరుడు

Groom Takes Bride Ashirwaad After Wedding Goes Viral - Sakshi

పెళ్లంటే మూడు ముళ్ల బంధంతో ఇద్దరు ఒక్కటిగా మారే వేడుక. ఇక వివాహం మొదలైనప్పటి నుంచి ప్రతీది ఓ సంప్రదాయం ప్రకారం పాటించడం మన  ఆనవాయితీ. అయితే గతంలో పోలిస్తే వీటిలో సందర్భానుసారంగా కొన్నింటిలో మార్పులు చోటు చేసుకున్నాయనే చెప్పాలి. పెళ్లిలో వధువు... వరుడి  కాళ్ల మీద పడి మొక్కడం, అప్పడు వరుడు ఆమెను ఆశ్వీరదించడం​ ప్రాచీన కాలం నుంచి అనుసరిస్తున్న ఈ ఆచారాన్ని మనం చూస్తునే ఉన్నాం.

తాజాగా ఓ వరుడు మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తించి ఆ వధువుతో పాటు నెటిజన్ల మనసును దోచుకున్నాడు. అసలు అంతలా ఆ వరుడు ఏం చేశాడు! ఓ పెళ్లి వేడుక అనంతరం..  వధువు ఆశీర్వాదం తీసుకోవడానికి వరుడి కాళ్ల మీద పడుతుండగా.. వెంటనే ఆ వరుడు ఆమెను అడ్డుకొని.. అతనే ఆమె కాళ్ల మీద ప‌డ్డాడు. దీంతో ఒక్క‌సారిగా ఆ వధువు షాక్ అయ్యి వెంట‌నే త‌న కాళ్ల‌ను వెన‌క్కి జ‌రుపుకుంటుంది.

కానీ అతను మాత్రం భార్యభర్తలంటే ఇద్దరు సమానంగా భావించి ఆమె తన కాళ్ల మీద పడినప్పుడు తాను అలా చేస్తే తప్పేంటి అని ఈ రకంగా చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వరుడి చేసిన పనికి ఫిదా అవుతున్నారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ వాళ్ల‌కు స‌పోర్ట్ చేస్తున్నారు.

చదవండి: కూతురు పుట్టిందని.. పానీపూరి వ్యాపారి గొప్పతనం..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top