India Meteorological Department: రాజస్తాన్‌లోని ఫలోదీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత | Sakshi
Sakshi News home page

India Meteorological Department: రాజస్తాన్‌లోని ఫలోదీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత

Published Sun, May 26 2024 4:37 AM

India Meteorological Department: Mercury touches 50 degrees Celsius in Phalodi

ఐదేళ్ల తర్వాత ఇదే మొదటిసారి 

న్యూఢిల్లీ:  ఉత్తర భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రధానంగా రాజస్తాన్‌లో ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతున్నా యి. రాజస్తాన్‌లోని ఫలోదీలో తాజాగా 50 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. దేశంలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రత రికా ర్డు కావడం ఐదేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 2019 జూన్‌ 1న రాజస్తాన్‌లోని చురూలో 50.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. 

హిమాలయ రాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌తోపాటు ఈశాన్యంలోని అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ ఎండల ధాటికి జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం రాజస్తాన్‌లోని బార్మర్‌లో 48.8, జైసల్మేర్‌లో 48, బికనెర్‌లో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యా యి. పశి్చమ బెంగాల్‌లోని కూచ్‌ బెహార్‌లో 40.5 డిగ్రీలు, అస్సాంలోని సిల్చార్‌లో 40, లుమిడింగ్‌లో 43, అరుణాచల్‌లోని ఈటానగర్‌లో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement