రేపు ఢిల్లీలో మళ్లీ ఉద్యమిస్తాం  | INDIA bloc to hold major protest in Delhi on 11 oct 2026 Says K C Venugopal | Sakshi
Sakshi News home page

రేపు ఢిల్లీలో మళ్లీ ఉద్యమిస్తాం 

Oct 11 2026 5:15 AM | Updated on Oct 11 2026 5:15 AM

INDIA bloc to hold major protest in Delhi on 11 oct 2026 Says K C Venugopal

సీజేఐకి మెమోరాండం అందజేస్తాం: కేసీ వేణుగోపాల్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో మోదీ–అమిత్‌ షా ద్వయం కనుసన్నల్లోనే భారీ ఎత్తున ‘ఓట్ల దొంగతనం’జరిగిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆరోపించారు. ఈ అక్రమాలకు నిరసనగా సోమవారం ఢిల్లీలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు ప్రకటించా రు. 

ప్రజాస్వామ్య మనుగడపై ఆందోళన చెందుతున్న ప్రతి పౌరుడు ఈ ఆందోళనలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం తలపెట్టిన నిరసనలో అనుసరించాల్సిన వ్యూ హం, కార్యాచరణను ఇండియా కూటమి నేతలతో జరిగిన భేటీలో సిద్ధం చేశామన్నా రు. దేశంలో తలెత్తిన ఎన్నికల సంక్షోభంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి వినతిపత్రాన్ని సమర్పిస్తామని వివరించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement