‘ఇండియా’ కమిటీల్లో నియామకాలు | INDIA Alliance Makes Additional Appointments In Newly-Formed Panels For 2024 Polls | Sakshi
Sakshi News home page

‘ఇండియా’ కమిటీల్లో నియామకాలు

Sep 3 2023 6:26 AM | Updated on Sep 3 2023 6:26 AM

INDIA Alliance Makes Additional Appointments In Newly-Formed Panels For 2024 Polls - Sakshi

న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమిలోని వివిధ కమిటీలకు మరికొన్ని నియామకాలు చేపట్టారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు కూటమిని సన్నద్ధం చేసే క్రమంలో శుక్రవారం ప్రకటించిన సమన్వయ, ఎన్నికల వ్యూహ కమిటీలోకి వివిధ పార్టీలకు చెందిన 14 మంది సభ్యులను తీసుకున్నారు.

తాజాగా, ప్రచార కమిటీలోకి కాంగ్రెస్‌ నేత గుర్దీప్‌ సింగ్‌ సప్పాల్, జేడీయూ నేత సంజయ్‌ ఝా, శివసేనకు చెందిన అనిల్‌ దేశాయ్, ఆర్జేడీ సంజయ్‌ యాదవ్, ఎన్‌సీపీ నుంచి పీసీ చాకో, జేఎంఎం నేత చంపాయి సోరెన్, ఎస్‌పీకి చెందిన నందా కిరణ్మయ్, ఆప్‌ నేత సంజయ్‌ సింగ్, సీపీఎం నేత అరుణ్‌ కుమార్, సీపీఐఎంఎల్‌ నుంచి రవి రాయ్, వీసీకే నుంచి తిరుమావలన్, ఐయూఎంఎల్‌ నేత కేఎం కాదర్‌ మొయిదిన్, కేసీ–ఎం నేత జోస్‌ కె మణి, డీఎంకేకు చెందిన తిరుచి శివ, పీడీపీ నేత మెహబూబ్‌ బేగ్‌లను నియమించారు. టీఎంసీ నుంచి ప్రాతినిథ్యం కల్పించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement