ఉత్తర భారతానికి హీట్‌వేవ్‌ అలర్ట్‌ | Sakshi
Sakshi News home page

ఉత్తర భారతానికి హీట్‌వేవ్‌ అలర్ట్

Published Sat, May 18 2024 3:23 PM

Imd Has Given Heat Wave Alert To Northern India

న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశానికి భారత వాతావరణశాఖ(ఐఎండీ) తాజాగా హీట్‌వేవ్‌ అలర్ట్ ఇచ్చింది. రాజధాని ఢిల్లీ సహా మొత్తం ఉత్తర భారతమంతా మే 21వ తేదీ  వరకు భానుడు చండ ప్రచండంగా నిప్పులు కురిపించనున్నాడని తెలిపింది. 

శుక్రవారం(మే17) దేశంలోనే రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం గమనార్హం. హీట్‌వేవ్‌ అలర్ట్‌ నేపథ్యంలో జైపూర్‌ నహార్‌ఘర్‌ బయలాజికల్‌ పార్కులోని జంతువులకు చల్లదనం అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని పార్కు అధికారులు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement