నేను ఇంకా ఆస్పత్రిలోనే: అభిషేక్‌ | I Remain In Hospital, Abhishek Bachchan | Sakshi
Sakshi News home page

నేను ఇంకా ఆస్పత్రిలోనే: అభిషేక్‌

Aug 2 2020 6:04 PM | Updated on Aug 2 2020 9:29 PM

I Remain In Hospital, Abhishek Bachchan - Sakshi

ముంబై: బాలీవుడ్‌ మెగాస్టార్‌, బిగ్‌ బీ  అమితాబ్‌ బచ్చన్‌ కరోనా వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ మాత్రం ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా జరిపిన పరీక్షల్లో అభిషేక్‌కు మరోసారి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు అభిషేక్‌ తెలిపారు. ‘  నాన్న అమితాబ్‌కు తాజా టెస్టుల్లో నెగిటివ్‌ వచ్చింది. ఫలితంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్చి అయ్యారు. ఇక ఇంటిలోనే విశ్రాంతి తీసుకోనున్నారు. మీ అందరి ప్రార్థనలు ఫలించడంతో నాన్న కోలుకున్నారు. అందరికీ ధన్యవాదాలు’ అని అభిషేక్‌ తన ట్వీటర్‌ అకౌంట్‌లో పేర్కొన్నారు. (కరోనా నుంచి కోలుకున్న అమితాబ్‌)

అదే సమయంలో తనకు మాత్రం మరోసారి జరిపిన టెస్టుల్లో కరోనా పాజిటివ్‌ వచ్చిందని అభిషేక్‌ వెల్లడించారు. ‘దురదృష్టవశాత్తూ నా శరీరంలో ఇంకా కోవిడ్‌-19 అవశేషాలు ఉన్నాయి. ఆస్పత్రిలోనే మరికొన్ని రోజులు చికిత్స తీసుకోవాల్సి ఉంది. మా కుటుంబం కోసం ప్రార్థించిన అందరికీ థాంక్స్‌. నేను త్వరలోనే కరోనాను జయిస్తా. ఆరోగ్యంగా తిరిగి వస్తా’ అని అభిషేక్‌ మరొక ట్వీట్‌లో పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్‌ బారిన పడ్డ అమితాబ్‌, అభిషేక్‌లు ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆదివారం అమితాబ్‌ కరోనాను గెలిచి ఇంటికి వెళ్లగా అభిషేక్‌ మాత్రం ఇంకా ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంది. అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్వర్య రాయ్, మనవరాలు ఆరాధ్యకు కూడా కరోనా సోకగా, ఇటీవలే వీరిద్దరూ కోలుకున్న సంగతి తెలిసిందే.(వాళ్ల‌కు భూమ్మీద బ‌తికే అర్హ‌త లేదు)

Advertisement
 
Advertisement
Advertisement