Sakshi News home page

లగ్జరీ అపార్ట్‌మెంట్లు, అదిరిపోయే విల్లాలు: ఫేవరెట్‌గా హైదరాబాద్‌ రికార్డ్‌

Published Wed, Oct 11 2023 12:41 PM

Hyderabad takes lead in luxury housing supply sets record in Q3 2023 - Sakshi

తెలంగాణ రాష్ట్ర రాజధాని  రియల్‌ ఎస్టేట్‌ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోంది. విలాసవంతమైన గృహాల సరఫరాలో ముందంజలో  ఉండటమే 2023 క్యూ3లో రికార్డు సృష్టించింది. తాజా నివేదికల ప్రకారం దేశంలోని అన్ని నగరాలను అధిగమించి భారతదేశంలో లగ్జరీ హౌసింగ్‌కు ఫేవరెట్‌గా హైదరాబాద్ నిలిచింది.

విలాసవంతమైన గృహాల సరఫరాలో అసాధారణమైన పెరుగుదలను సాధించింది. 2023 మూడో త్రైమాసికంలో దాదాపు 14,340 యూనిట్లతో లగ్జరీ హౌసింగ్‌కు గో-టు డెస్టినేషన్‌గా హైదరాబాద్ నిలిచింది. హై-ఎండ్ లివింగ్‌కు హైదరాబాద్‌ బలమైన డిమాండ్‌ను నమోదు చేసిందని అనారాక్ నివేదిక తాజాగా వెల్లడించింది.  లగ్జరీ హౌసింగ్ జనాదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ, బెంగళూరు లాంటి ప్రధాన నగరాలను కూడా దాటేసింది హైదరాబాద్‌. అలాగే గృహ కొనుగోలుదారులలో ప్రాధాన్యతలలో గణనీయమైన మార్పును  ఈ రిపోర్ట్‌ హైలైట్ చేసింది. అలాగే పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కొత్త లగ్జరీ ప్రాజెక్ట్‌లతో  డెవలపర్‌లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారని  పేర్కొంది. (రూ.100 కోట్ల అపార్ట్‌మెంట్‌ డీల్‌: షాక్‌ అవుతున్న మార్కెట్‌ నిపుణులు )

Q3 2018లో, ఇక్కడ కేవలం 210 లగ్జరీ యూనిట్లు లాంచ్‌ అయాయ్యి.  2023 క్యూ3 నాటికి హైదరాబాద్ 14,340 లగ్జరీ యూనిట్లకు చేరింది. ఈ త్రైమాసికంలో మొత్తం కొత్త లగ్జరీ హౌసింగ్ సరఫరాలో దాదాపు 46 శాతం వాటాను కలిగి ఉంది. కోవిడ్‌  తర్వాత దాని అసాధారణ పనితీరు కారణంగా డెవలపర్లు లగ్జరీ గృహాల విభాగంలో బలమైన విశ్వాసంతో ఉన్నారు.   పాండమిక్‌ తరువాత టాప్‌ నాచ్‌  సౌకర్యాలు,  బిగ్‌ గృహాల కోసం  కొనుగోలుదారుల డిమాండ్‌తో  దేశంలోని టాప్ ఏడు నగరాల్లో అమ్మకాలు పెరిగాయనిఅనరాక్ గ్రూప్ రీజినల్ డైరెక్టర్  అండ్‌  హెడ్ (పరిశోధన), ప్రశాంత్ ఠాకూర్వ్యాఖ్యానించారు, 

అనరాక్  ఇటీవలి వినియోగదారుల సెంటిమెంట్ సర్వే ప్రకారం మహమ్మారికి ముందు (H1 2019) నుండి  9 శాతం మంది మాత్రమే రూ. 1.5 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన విలాసవంతమైన గృహాలను ఇష్ట పడ్డారు. అయితే, H1 2023లో ఇటీవలి సర్వేలో, ఈ సంఖ్య 16 శాతానికి పెరిగింది. హౌసింగ్ మార్కెట్‌లో హైదరాబాద్, ముంబై (MMR), ఢిల్లీ-NCR, పూణే, బెంగళూరు, కోల్‌కతా ,చెన్నైలతో సహా ఏడు ప్రధాన నగరాల్లో రూ. 40 లక్షలు లేదా అంతకంటే తక్కువ ధర ఉన్న ఇళ్ల డిమాండ్‌ కేవలం 18 శాతం మాత్రమే కావడం  గమనార్హం.అయితే హైదరాబాద్‌లో లగ్జరీ హౌసింగ్ విజృంభిస్తున్నప్పటికీ, సరసమైన గృహాల పరిస్థితి భిన్నంగా ఉందని కూడా  అనరాక్‌ నివేదించింది. 
 

Advertisement

What’s your opinion

Advertisement