ఇది మామూలు ప్రేమ కాదు.. అగ్నికంటే స్వచ్ఛమైనది | Hut No Bar for Love A Cross Border Wedding in Bihar | Sakshi
Sakshi News home page

ఇది మామూలు ప్రేమ కాదు.. అగ్నికంటే స్వచ్ఛమైనది

Oct 13 2026 9:21 PM | Updated on Oct 13 2026 9:21 PM

 Hut No Bar for Love A Cross Border Wedding in Bihar
  • బిహార్ యువకుడితో ప్రేమ
  • 6 నెలల పాటు ఎడబాటు
  • ఇండియాకు వచ్చిన రష్యా యువతి

ప్రేమకు ఏదీ అడ్డుకాదని నిరూపించే ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. ఉపాధి కోసం రష్యా వెళ్లిన బిహార్‌కు చెందిన రాహుల్ యాదవ్ అక్కడ జూలీ అనే యువతితో ప్రేమలో పడ్డాడు. కొంతకాలం తర్వాత రాహుల్ భారత్‌కు తిరిగొచ్చాడు. అయితే, అతడికి దూరంగా ఉండలేకపోయిన జూలీ.. ఆరు నెలల తర్వాత తన కుటుంబంతో కలిసి ఇండియాకు వచ్చింది.

ప్రియుడిని వెతుక్కుంటూ బిహార్‌లోని భాగల్‌పూర్‌కు చేరుకున్న జూలీ.. రాహుల్‌తో కలిసి జీవించాలనే తన నిర్ణయాన్ని కుటుంబ సభ్యులకు స్పష్టం చేసింది. రాహుల్ గుడిసెలో నివసిస్తున్నాడని తెలిసినా, అతడితోనే ఉంటానని తేల్చి చెప్పింది. ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా తన ప్రేమించిన వ్యక్తితోనే జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకుంది. 

జూలీ నిర్ణయంతో ఇరు కుటుంబాల పెద్దలు కూడా వారి ప్రేమకు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో నవంబర్‌లో రాహుల్, జూలీల వివాహం జరిపించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించినట్లు సమాచారం. దీంతో రష్యాలో మొదలైన వీరి ప్రేమకథ.. బిహార్‌లో పెళ్లి బంధంగా మారనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement