తమిళనాడు అభ్యర్థులు.. వందలమందిపై క్రిమినల్ కేసులు | Hundreds of Candidates in Tamil Nadu Face Criminal Cases | Sakshi
Sakshi News home page

తమిళనాడు అభ్యర్థులు.. వందలమందిపై క్రిమినల్ కేసులు

Apr 22 2026 10:03 AM | Updated on Apr 22 2026 10:50 AM

Hundreds of Candidates in Tamil Nadu Face Criminal Cases

తమిళనాడులో రేపు ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రచారం పూర్తి చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో ఓ నివేదిక ఆందోళన కలిగిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులలో దాదాపు 404 మందికి పైగా అత్యంత తీవ్రమైన క్రిమినల్‌ కేసులున్నాయని నివేదిక తెలిపింది.

తమిళనాడు ఎన్నికలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌, టీన్యూ ప్రకటించిన సర్వే వివరాలు ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మెుత్తంగా 4,023 మంది ఉండగా వారిలో  3,992 మంది అఫిడవిట్లు పరిశీలించబడ్డాయి. అందులో తీవ్రమైన కేసులు ఉన్నవారు 404 మందిపై తీవ్రమైన కేసులున్నట్లు తేలింది. గతంతో పోలిస్తే ఇది దాదాపు  రెట్టింపు అయ్యిందని నివేదిక పేర్కొంది.

722 మందిపై  క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. వీరిలో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులే అధిక సంఖ్యలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. . వీరిలో దాదాపు 18% అభ్యర్థులు సుప్రీం కోర్టు మార్గదర్శకాలు పాటించకపోవడం వల్ల టికెట్లు పొందినట్లు తెలిపింది. 58% స్థానాల్లో వివిధ అభ్యర్థులు క్రిమినల్ కేసులు కలిగి ఉండటంతో వాటిని ఆయా నియోజకవర్గాలను  'రెడ్ అలర్ట్'గా గుర్తించారు.  

ఎన్నికల బరిలో ఉన్న మొత్తం 3,992 మంది అభ్యర్థుల ప్రకటించిన ఆస్తుల విలువ రూ. 20,678 కోట్లు. అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ మూడు రెట్లు పెరిగి రూ. 5.17 కోట్లకు చేరుకుంది. వీరిలో ఇది వరకే  981 మంది కోటీశ్వరులని తెలిపారు. మరి కొంతమందికైతే ఏకంగా వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు

అత్యధిక ఆస్తులు కలిగిన అభ్యర్థుల జాబితా

AIADMK అభ్యర్థి లీమా రోజ్ మార్టిన్ – ₹5,863 కోట్లు.

TVK నాయకుడు సి. జోసెఫ్ విజయ్ – ₹648 కోట్లు.

TVK అభ్యర్థి ఆథవ్ అర్జున – ₹534 కోట్లు. ఎన్నికల ఎదుట ఈ నివేదిక ప్రజలను కొంత ఆందోళనకు గురి చేస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement