
న్యూఢిల్లీ: భారత్‌లోని హిందువుల జనాభా తగ్గుతోందని, మైనారిటీల జనాభా క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అధ్యయనంలో తేలింది. 1950 నుంచి 2015 మధ్య దేశంలోని మొత్తం జనాభాలో హిందువుల జనాభా 7.8 శాతం తగ్గినట్లు వెల్లడయ్యింది. 1950లో దేశ జనాభాలో హిందువులు 84 శాతం మంది ఉండగా, 2015 నాటికి దాదాపు 78 శాతానికి పడిపోయినట్లు అధ్యయనం వెల్లడించింది. ఇదే సమయంలో మొత్తం జనాభాలో ముస్లింల జనాభా 9.84 శాతం నుంచి 14.09 శాతానికి చేరింది.