సోనియా ఆత్మకథ ముద్రణ హార్పర్‌ కాలిన్స్‌ చేతికి | Harper Collins India will publish by Sonia Gandhi autobiography | Sakshi
Sakshi News home page

సోనియా ఆత్మకథ ముద్రణ హార్పర్‌ కాలిన్స్‌ చేతికి

Sep 5 2026 6:26 AM | Updated on Sep 5 2026 6:26 AM

 Harper Collins India will publish by Sonia Gandhi autobiography

నవంబరు 10న భారత్‌లో విడుదల

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ ముద్రణ బాధ్యతలను హార్పర్‌ కాలిన్స్‌ ఇండియా చేపట్టింది. ముందుగా నిర్ణయించినట్టు ఈ పుస్తకం భారత్‌లో నవంబర్‌ 10నే విడుదల కానుంది. వాస్తవానికి ఈ పుస్తకాన్ని పెంగ్విన ర్యాండమ్‌ హౌస్‌ ప్రచురించాల్సి ఉండింది. అయితే కొన్ని అంశాల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పెంగ్విన్‌ తాము ఈ పుస్తకాన్ని ప్రచురించడం లేదని ప్రకటించింది. 

ఈ నేపథ్యంలో ఏర్పడ్డ అనిశ్చితి కాస్తా హార్పర్‌ కాలిన్స్‌ ఇండియా నిర్ణయంతో తొలగిపోయింది. చాలామంది ఎంతో ఆసక్తిగా రాజకీయ ఆత్మకథ కోసం ఎదురు చూస్తున్నారని.. ఇందులో నాటకీయత, వ్యక్తిగత అనుభవాలు, ప్రేమ, గుర్తింపు కోసం పోరాటం, బాధ్యతల వంటి అనేక కోణాలు ఆవిష్కృతమవుతాయిన హార్పర్‌ కాలిన్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది.
  
రాతపత్రిలో కొన్ని మార్పులు చేసేందుకు నిరాకరించడంతో సోనియాగాందీకి, పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్‌ ఇండియా మధ్య వివాదం మొదలైన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో చైనా ఆక్రమించిన భారత భూభాగానికి సంబంధించిన విభాగాలు, ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధించిన అంశాలను తొలగించాల్సిందిగా పెంగ్విన్‌ సోనియాను కోరినట్లుగా కాంగ్రెస్‌ నేతలు ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకుంటోందని ఆరోపించారు. మరోవైపు పెంగ్విన ఇండియా మాత్రం తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, ఒకానొక అంశంపై పడ్డ చిక్కుముడి వీడకపోవడంతో ప్రచురణ బాధ్యతల నుంచి తప్పుకున్నామని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement