అన్నీ ఆలోచించాకే పిల్లలకు టీకాపై నిర్ణయం | Govt will decide on COVID vaccination of children | Sakshi
Sakshi News home page

అన్నీ ఆలోచించాకే పిల్లలకు టీకాపై నిర్ణయం

Oct 18 2021 3:44 AM | Updated on Oct 18 2021 3:44 AM

Govt will decide on COVID vaccination of children - Sakshi

న్యూఢిల్లీ: శాస్త్రీయంగా, హేతుబద్ధంగా అధ్యయనం చేసి, కోవిడ్‌–19 వ్యాక్సిన్ల పంపిణీ పరిస్థితుల్ని అంచనా వేసుకున్నాకే పిల్లలు, కౌమార దశలో ఉన్న వారికి వ్యాక్సినేషన్‌పై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని కరోనా టాస్క్‌ఫోర్స్‌ చీఫ్‌ వి.కె.పాల్‌ చెప్పారు. ఇప్పటికే చాలా దేశాలు 18 ఏళ్లలోపు వారికి టీకా డోసులు ఇస్తున్నారని, అయితే తాము అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతే పిల్లల వ్యాక్సిన్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తామని ఆదివారం చెప్పారు. భారత్‌ బయోటెక్‌ కోవాగి్జన్‌ టీకాను 2–18 ఏళ్ల వయసు వారికి ఇవ్వొచ్చునని డీసీజీఐ నిపుణుల కమిటీ సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కోవిషీల్డ్, కోవాగి్జన్, స్పుత్నిక్‌ వ్యాక్సిన్లు 18 ఏళ్లు పైబడిన వారికి ఇస్తున్నారు. 2–18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్‌పై శాస్త్రీయ అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వి.కె.పాల్‌ స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement