Manipur Violence: 3 Mutilated Bodies of Village Guards Found in Ukhrul - Sakshi
Sakshi News home page

మణిపూర్‌లో రెండు వారాల తర్వాత మళ్లీ చెలరేగిన హింస.. కాల్పుల్లో ముగ్గురి మృతి

Aug 18 2023 2:33 PM | Updated on Aug 18 2023 3:14 PM

fresh incident of violence in Manipur Updates - Sakshi

రెండువారాల తర్వాత మణిపూర్‌లో మళ్లీ  హింసాత్మక ఘటన చోటు చేసుకుంది.. 

ఇంఫాల్‌: మణిపూర్‌లో రెండు వారాల తర్వాత మళ్లీ హింస చెలరేగింది. తుంగ్ఖుల్‌ నాగా జనాభా అధికంగా ఉండే ఉఖ్రూల్‌ రీజియన్‌లోని తోవాయి కుకీ అనే గ్రామంలోముగ్గురిని కాల్చి చంపింది అల్లరి మూక.  

ఉఖ్రూల్‌ ఎస్సీ నింగ్షెమ్‌ వషుమ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం వేకువ ఝామున 4.30.గం. ప్రాంతంలో తోవాయి కుకీ గ్రామానికి కాపలాగా ఉన్న ముగ్గురిని ఆయుధాలతో వచ్చిన కొందరు దుండగులు కాల్చి చంపారు. ఈలోపు కొందరు గ్రామస్తులు అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలోని చెక్‌పోస్ట్‌కు వచ్చి భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. సిబ్బంది ఆ గ్రామానికి చేరుకునేలోపే దుండగులు పరారయ్యారు. వాళ్ల కోసం గాలింపు చేపట్టడంతో పాటు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పర్యవేక్షిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. 

ఇదిలా ఉంటే.. మణిపూర్‌లో కొనసాగుతున్న గిరిజన-గిరిజనేతర వర్గపోరులో భాగంగానే  ఈ కాల్పులు జరిగాయని ఎస్సీ ధృవీకరించారు. కాల్పులు జరిగింది మారుమూల గ్రామంలో కావడం, భద్రతా సిబ్బందిని అక్కడ మోహరించలేకపోయామని ఎస్సీ వెల్లడించారు. ఇక మణిపూర్‌లో కొనసాగుతున్న అల్లర్ల నేపథ్యంలో గత రెండు నెలలుగా గ్రామస్తులే తమ యువతను కాపలాగా ఉంచుతూ వస్తున్నారు. ఈ ఘటన ప్రభావం చుట్టుపక్కల గ్రామాలకు విస్తరించకుండా భద్రతా బలగాలు మోహరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement