అందులో ఏం తప్పుంది!... కేంద్రం పై నిప్పులు చెరిగిన కేజ్రీవాల్‌

Free Revdi Remark On Modi Kejriwal Asks Whats Wrong Free Education - Sakshi

న్యూఢిల్లీ: ఎన్నికల్లో గెలిచేందుకు కొన్ని పార్టీలు ఉచిత రెవిడిలు(ఉచిత పథకాలను) అందిస్తున్నారంటూ నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలా ఉచితాలను ప్రజలకు ఎరగా వేసి అధికారంలోకి రాకూడదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్రంపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ప్రభుత్వంతో సన్నిహితంగా ఉ‍న్న కొంతమంది వ్యక్తులకు సంబంధించి సుమారు రూ. 10 లక్షల కోట్ల రుణాలను సాక్షాత్తు కేంద్రమే మాఫీ చేసిందంటూ ఆరోపణలు చేశారు.

ఈ ప్రక్రియలో పాల్గొన్నవారిని సైతం కటకటాల వెనక్కి పంపాలంటూ మండిపడ్డారు. మంత్రులకు ఉచితంగా విద్యుత్‌ ఇచ్చినప్పుడూ మరీ సామాన్యులకు ఎందుకు ఉచిత పథకాలు ఉండకూడదంటూ ప్రశ్నించారు. సామాన్యులకు ఉచిత విద్య, ఉచిత నీరు కల్పించడంలో తప్పు ఏముందన్నారు. బడా కార్పోరేట్లకు పెద్ద మొత్తాల్లో ఉచితంగా రుణ మాఫీ చేయడంలో లేని తప్పు ఇందులో ఎందుకు ఉంది అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు.

(చదవండి: హఠాత్తుగా పెరిగిన నది ఉధృతి... ఏకంగా 14 కార్టు గల్లంతు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top