తండ్రి, ఇద్దరు కుమార్తెల ఆత్మహత్య 

Father And Two Daughters Deceased In Tamil Nadu - Sakshi

తిరువళ్లూరు: తిరువళ్లూరు సమీపంలోని కసువ గ్రామంలో మనస్తాపంతో తండ్రితో కలిసి ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య చేసుకున్నారు. పాక్కం గ్రామానికి చెందిన సెల్వరాజ్‌(65) భార్య ఆరేళ్ల క్రితం మృతిచెందింది. సెల్వరాజ్‌ కుమార్తెలు హేమలత(35), శాంతి(31)తో కలిసి ఉంటున్నాడు. హేమలత భర్త నుండి విడిపోయింది. శాంతి మానసిక వికలాంగురాలు. వీరు ఉంటున్న ఇంటి నుంచి దుర్గంధం రావడంతో స్థానికులు గురువారం వెంగల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు పరిశీలించగా ముగ్గురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. ఇంట్లో రూ.4800 నగదు, ఆరున్నర సవర్ల బంగారు నగలు, డైరీని స్వాధీనం చేసుకున్నారు. డైరీలో ఆత్మహత్యకు గల కారణాలను రాశారు. తమ ఇల్లు, ఆరు సెంట్ల భూమి, బంగారు నగలు, తమ ఆస్తులను సేవాలయకు అప్పగించాలని అందులో కోరారు.

చదవండి: కారు హారన్‌ మోగించాడని... ఎంత పని చేశారంటే..  
సాక్షి ఎఫెక్ట్‌: మాయలేడి అరెస్టు

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top