హీరా గోల్డ్ సీఈఓ నౌహీరా షేక్ కు ఈడీ షాక్ ఇచ్చింది. సంస్థకు చెందిన ఆస్తుల వేలం ప్రారంభించింది. వేలం పాట ద్వారా మెుత్తం రూ.93.63కోట్ల వసూళ్లు జరుగుతాయని ఈడీ అంచనా వేస్తోంది. ఇప్పటి వరకూ రూ.428 కోట్లు ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇటీవలే ఒక స్థిరాస‍్థిని రూ.19.64 కోట్లకు రిజిష్ట్రేషన్ పూర్తి చేసింది. కాగా మిగతా ఆస్తులకు వేలం పాట ప్రారంభించింది. వసూలైన సొమ్మును బాధితులకు పరిహారంగా చెల్లించనున్నారు.
గోల్డ్ డిపాజిట్ పేరుతో లక్షలాది కస్టమర్లనుంచి రూ. 5,900 కోట్లు వసూలు చేసినట్లు హీరాగ్రూప్ పై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసింది. హీరా పై దేశవ్యాప్తంగా 52 కేసులు నమోదయ్యాయి. సొమ్ము వసూలు కాగానే బాధితులకు పరిహారం అందించే కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలుస్తోంది.


