మణిపూర్‌లో డ్రగ్స్‌‌ గుట్టురట్టు.. | Drugs Seized In Manipur 6 Arrested | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ పట్టుకున్న మణిపూర్‌ పోలీసులు..

Dec 9 2020 1:52 PM | Updated on Dec 9 2020 3:40 PM

Drugs Seized In Manipur 6 Arrested - Sakshi

సాక్షి, మణిపూర్: అక్రమంగా డ్రగ్స్‌ తరలిస్తున్న ఆరుగురిని మణిపూర్‌లోని టెంగ్నౌపాల్‌ జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారివద్ద నుంచి రూ.165 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాల‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు మయన్మార్‌కి చెందిన వారు. మణిపూర్‌ పోలీసు‌లు, నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ నిర్వహించారు.  మోరేలోని రెండు ప్రాంతాలలో పట్టుబడిన వారిని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. గత నెలలో మయన్మార్‌ సరిహద్దు మోరే మీదుగా అక్రమంగా పెద్ద మొత్తంలో రవాణా చేస్తున్న డ్రగ్స్‌ని అస్సాం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మయన్మార్ వైపు నుంచి సరిహద్దు దాటడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తి నుంచి 6.5 కోట్ల విలువైన 13  ప్యాకెట్ల మత్తు టాబ్లెట్లను స్వాధీనం చేసుకొని, అతడిని అరెస్టు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement