
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ ‘షార్’ నూతన డైరెక్టర్‌గా ఈఎస్ పద్మకుమార్ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు పనిచేసిన డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌కు డైరెక్టర్‌గా బదిలీ కావడంతో బెంగళూరులోని ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్ యూనిట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఈఎస్ పద్మకుమార్‌ను షార్ నూతన డైరెక్టర్‌గా నియమించారు.
పద్మకుమార్ బెంగళూరు ఐఐఎస్సీలో సిస్టం సైన్స్ అండ్ ఆటోమేషన్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి, 1996లో ఇస్రోలో ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరారు. ఆయన ఏఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, ఎల్‌వీఎం3, ఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రయోగ వాహనాలతో పాటు మార్స్ ఆర్బిటార్ మిషన్, చంద్రయాన్, ఆదిత్య ప్రయోగాల్లో కీలకంగా వ్యవహరించారు.