దేశంలో గత కొన్నేళ్లుగా దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడంపై పలు ఆంక్షలు విధించారు. బాణసంచా నుండి వెలువడే పొగ ఆరోగ్యానికి హానిచేస్తుంది. అలాగే కాలుష్యాన్ని కూడా వ్యాపింపజేస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే బాణసంచా కొనుగోళ్లు, అమ్మకాలను నిషేధించారు.
అయితే దీపావళి వేళ బాణసంచా లేకుండా సరదాగా ఎలా గడపడం? ఇది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇప్పుడు బాణసంచాకు బదులుగా ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి వెలుగు జిలుగులను, ధ్వనిని అందించినప్పటికీ కాలుష్యాన్ని కలుగజేయవు. ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్‌ను కాల్పడం వలన ఎటువంటి హాని జరగదు.
ఎలక్ట్రానిక్ టపాసులు నిజమైన టపాసుల మాదిరిగనే కనిపిస్తాయి. వాటిలానే వెలుగులను ఇస్తాయి. అయితే ఇవి రిమోట్‌తో పనిచేస్తాయి. వీటిని వినియోగించినప్పుడు నిజమైన బాణసంచాను కాల్చిన అనుభూతినే పొందవచ్చు. ఎలక్ట్రానిక్ టపాసులు వెలిగించేందుకు ఎటువంటి అగ్గిపెట్టె లేదా నిప్పు అవసరం లేదు. ఇవి ఎంతో సురక్షితమైనవి. కాలుష్యాన్ని కూడా వెదజల్లవు. ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్‌లో వివిధ రకాల శబ్ధాలు, వెలుగులను చూడవచ్చు.
remote control ignition device for crackers
दिवाली में पटाखे जलाने के सुरक्षित यंत्र
शुभ दिवाली 🪔 pic.twitter.com/VLj2n0tNFV— Er Ranjeet Singh (@ErRanjeetSingh) October 27, 2024
ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్ లోపల వైర్లతో అనుసంధానమైన పలు చిన్న పాడ్‌లు, ఎల్‌ఈడీ లైట్లు ఉంటాయి. వీటిని ఆన్ చేసినప్పుడు పాడ్‌ల నుంచి స్పార్క్ వస్తుంది. అలాగే బాణసంచా మాదిరి శబ్దం కూడా వస్తుంది. ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్‌ను రిమోట్ ద్వారా నియంత్రించవచ్చు. ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్‌ను వినియోగించి వినూత్నమైన దీపావళి ఆనందాన్ని పొందవచ్చు.
ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్‌ను మార్కెట్‌లో లేదా ఆన్‌లైన్‌లో సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఇవి కొంచెం ఖరీదైనవే అయినప్పటికీ పర్యావరణానికి  ఎటువంటి హాని చేయవు. వీటిని పలుమార్లు ఉపయోగించవచ్చు. వీటిధర రూ.2,500 వరకూ ఉండవచ్చు.
ఇది కూడా చదవండి: వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో దీపావళి వెలుగులు

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
