రైలులో వదంతులు.. కిందకు దూకి ప్రాణాలు కోల్పోయిన నలుగురు | Dhanbad Division Intercity Express Fire Rumour, Passengers Jump Off Train, Some Hit By Goods Train | Sakshi
Sakshi News home page

Dhanbad Train Fire Rumour: రైలులో వదంతులు.. కిందకు దూకి ప్రాణాలు కోల్పోయిన నలుగురు

Published Sat, Jun 15 2024 9:26 AM | Last Updated on Sat, Jun 15 2024 9:56 AM

Dhanbad Division Intercity Express Fire Rumour

వదంతులు.. ఎంతటివారినైనా ఒకింత ఆలోచింపజేస్తాయి. అదే ప్రమాదానికి సంబంధించిన వదంతులైతే దాని పరిణాలమాలు ఊహించని విధంగా ఉంటాయి. జార్ఖండ్‌లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకోగా, నలుగురు ప్రాణాలు కోల్పోయారు

జార్ఖండ్‌లోని లాతేహార్‌లో రాంచీ-ససారం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్నదంటూ వదంతులు వ్యాపించడంతో ఆ రైలులోని పలువురు ప్రయాణికులు రైలు నుంచి దూకేశారు. ఈ సమయంలో ప్రయాణికులు అటుగా వస్తున్న గూడ్స్ రైలు ఢీకొన్నారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది అంబులెన్‌లో  ఘటనా స్థలానికి చేరుకున్నారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ససారం-రాంచీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ కుమాండిహ్ స్టేషన్ సమీపానికి వచ్చిన సమయంలో ఒక ప్రయాణీకుడు రైలుకు నిప్పుంటుకున్నదంటూ నానా హంగామా చేశాడు. దీంతో ప్రయాణికుల్లో  భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే కొందరు ప్రయాణికులు రైలు నుంచి కిందుకు దూకేశారు. ఈ సమయంలో ఎదురుగా ఒక గూడ్స్ రైలు వస్తోంది. దానిని ఢీకొన్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడినట్లు సమాచారం.

విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం నేపధ్యంలో స్టేషన్‌లో ఉన్న ప్రయాణికుల్లోనూ ఆందోళన నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు రైల్వే పోలీసులు ప్రయత్నించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement