
భింద్: దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో భక్తులు అమ్మవారికి కానుకలు చెల్లించుకోవడంతో పాటు, తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. అయితే ఒక భక్తుడు అమ్మవారికి తన నాలుకను సమర్పించి, తన భక్తిని చాటుకున్నాడు.
మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో గల రతన్‌గఢ్ దేవి ఆలయానికి వచ్చిన ఒక భక్తుడు తన నాలుకను కోసుకుని, దానిని అమ్మవారి సమర్పించాడు. ఈ విషయం తెలియగానే స్థానికులు ఆలయానికి తండోపతండాలుగా తరలివచ్చారు. రతన్‌గర్ దేవి ఆలయం భిండ్‌లోని లాహర్ నగర్‌లో ఉంది. ఈ ఆలయాన్ని 2015లో నిర్మించారు.
నవరాత్రుల సందర్భంగా ఆలయానికి వచ్చిన రామ్‌శరణ్ భగత్ తన నాలుకను తెగ్గోసుకుని, అమ్మవారికి సమర్పించాడు. తరువాత ఆ రక్తాన్ని ఆలయం వెలుపల ఉంచిన పాత్రలో పోశాడు. దీనిని చూసిన అక్కడివారంతా తెగ ఆశ్చర్యపోయారు. నాలుకను సమర్పించాక ఆ భక్తుడు ఆలయంలోనే కాసేపు నిద్రించాడు.
ఇది కూడా చదవండి: బలి తంతు లేకుండా జరిగే 'పూల తల్లి ఆరాధన'..! ఇక్కడ దసరా..