Delhi Air Pollution: ఢిల్లీ కాలుష్యంపై సీఎం కీలక నిర్ణయం: వారం రోజులపాటు..

Delhi Schools Govt Offices Closed For a Week In Delhi Over Pollution - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటడంతో ఆప్‌ ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి దేశ రాజధానిలో వారం రోజులపాటు పాఠశాలలు మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. పిల్లలు కలుషితమైన గాలిని పీల్చకుండా ఉండేందదుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సచివాలయంలో ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం అనంతరం కేజ్రీవాల్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

కాగా ప్రభుత్వ అధికారులందరూ వారం రోజులు వర్క్‌ ఫ్రం హోం పనులు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే విలైనంత వరకు ప్రైవేటు సంస్థలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం సదుపాయం కల్పించాలని సూచించారు. నవంబర్‌ 14 నుంచి 17 వరకు  నిర్మాణ రంగ పనులు అన్నింటిపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు.  అదే విధంగా ఢిల్లీలో లాక్ డౌన్ విధించాలన్న సుప్రీంకోర్టు సూచనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, తమ ప్రణాళికను సుప్రీంకోర్టుకు అందజేస్తామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top