ఆధార్‌తో ఆస్తుల అనుసంధానం.. కేంద్రానికి హైకోర్టు కీలక ఆదేశం | Delhi HC Asks Centre To Take Decision on Aadhaar With Property Documents | Sakshi
Sakshi News home page

ఆధార్‌తో ఆస్తుల అనుసంధానం.. కేంద్రానికి హైకోర్టు కీలక ఆదేశం

Dec 21 2023 3:45 PM | Updated on Dec 21 2023 4:26 PM

Delhi HC Asks Centre To Take Decision on Aadhaar With Property Documents - Sakshi

సాక్షి, ఢిల్లీ: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరి స్థిర, చరాస్తులను ఆధార్‌తో అనుసంధానం చేసే విషయంపై పరిశీలించి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. 

వివరాల ప్రకారం.. దేశంలో ప్రతీ ఒక్కరి ఆస్తులను ఆధార్‌తో అనుసంధానం చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌)పై ఢిల్లీ హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రానికి కీలక ఆదేశాలను జారీ చేసింది. కాగా, విచారణ సందర్బంగా ప్రతీ ఒక్కరి స్థిర, చరాస్తులను ఆధార్‌తో అనుసంధానం చేసే విషయాన్ని పరిశీలించి మూడు నెల్లలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇక, ఇదే సమయంలో పిటిషనర్ లేవనెత్తిన అంశాలను విజ్ఞాపనగా తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. 

అయితే, అవినీతి, నల్లధనం ఉత్పత్తి, బినామీ లావాదేవీలను అరికట్టేందుకు పౌరుల చర, స్థిరాస్తి పత్రాలను వారి ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. దీంతో, జస్టిస్ రాజీవ్ శక్ధేర్, జస్టిస్ గిరీష్ కత్పాలియాలతో కూడిన డివిజన్ బెంచ్ కేంద్రాన్ని పైవిధంగా ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement