ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మరో అరెస్ట్‌.. పదకొండుకు చేరిన సంఖ్య

Delhi excise policy case: ED arrests Arun Ramachandra Pillai - Sakshi

సాక్షి, ఢిల్లీ:  దేశంలో ప్రకంపనలు సృష్టించిన లిక్కర్‌ స్కాంలో మరో అరెస్ట్‌ చోటు చేసుకుంది. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్‌ రామచంద్ర పిళ్లైని అరెస్ట్‌ చేసింది. 

ఇదిలా ఉంటే అరుణ్‌ రామచంద్ర పిళ్లైని ఇటీవలె రెండు రోజులపాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆయన్ని అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. దీంతో లిక్కర్‌ స్కాంలో అరెస్ట్‌ అయిన వాళ్ల సంఖ్య 11కి చేరింది.

ఇదిలా ఉంటే.. గతంలోనే ఈ స్కాంలో ఆయన్ని నిందితుడిగా చేర్చిన ఈడీ.. ఆయన ఇంట్లో సోదాలు కూడా నిర్వహించింది. ఆయనకు సంబంధించిన కోట్ల రూపాయల ఆస్తులను సైతం జప్తు చేసింది. మరోవైపు లిక్కర్‌ స్కాంకు సంబంధించి మనీశ్‌ సిసోడియాను ఈడీ ఇవాళ ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు మనీలాండరింగ్‌ కేసును సవాల్‌ చేస్తూ శరత్‌ చంద్రారెడ్డి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును కోర్టు విచారణ చేపట్టనుంది. ప్రస్తుతం ఆయన తీహార్‌ జైల్‌లో ఉన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top