కోర్టులో సీజేపీ నేత రత్నా సింగ్ పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో చేపట్టిన నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు తనను అడ్డుకుని, అక్రమంగా నిర్బంధించారంటూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) న్యాయ విభాగం అధిపతి రత్నా సింగ్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. నిర్బంధించిన పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని శనివారం సాకేత్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టులో పిటిషన్ వేశారు.
శనివారం మరో ఇద్దరు న్యాయవాదులతో కలిసి సుప్రీంకోర్టు వైపు వెళ్తుండగా తనను ఇంటి వెలుపలే పోలీసులు అడ్డుకున్నారని రత్నా సింగ్ తెలిపారు. రెండు కార్లను అడ్డంగా నిలిపి తన వాహనం ముందుకు వెళ్లకుండా చేశారని, ఇందుకు సంబంధించిన వీడియోను పరిశీలించాలని కోరారు. తన ప్రాథమిక హక్కులకు, వ్యక్తిగత స్వేచ్ఛకు పోలీసులు భంగం కలిగించారని ఆరోపించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని అభ్యరి్థంచారు.


