చీఫ్‌ సెక్రటరీని తొలగించండి

Delhi CM Kejriwal In Report To LG Recommends Suspension Of Chief Secretary - Sakshi

ఢిల్లీ ఎల్జీని కోరిన సీఎం కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్‌ కుమార్‌ను బాధ్యతల నుంచి తప్పించాలని ఢిల్లీ లెఫ్టినెంట్‌ జనరల్‌(ఎల్జీ)ని సీఎం కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. నరేశ్‌ కుమార్‌ తన కుమారుడికి చెందిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి, ఐఎల్‌బీ అనే సంస్థతో ఎంవోయూ కుదిరేందుకు అధికార దురి్వనియోగానికి పాల్పడినట్లు విజిలెన్స్‌ మంత్రి అతీషి ఆరోపించారు. ఈ మేరకు నివేదికను ఇటీవల సీఎం కేజ్రీవాల్‌కు అందజేశారు.

ఆ నివే దికను కేజ్రీవాల్‌ శనివారం లెఫ్టినెంట్‌ జనరల్‌ వీకే శుక్లాకు పంపారు. అతీషి సిఫారసుల మేరకు ప్రధాన కార్యదర్శి నరేశ్‌ కుమార్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆరోపణలను చీఫ్‌ సెక్రటరీ నరేశ్‌ కుమార్‌ తీవ్రంగా ఖండించారు. తనకుమారుడికి ఎటువంటి కంపెనీతోను, ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. ఐఎల్‌బీఎస్‌ సంస్థ కూడా అతీషి చేసిన ఆరోపణలు నిరాధారాలంటూ ఖండించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top