కాసేపట్లో రైతుల ‘ఢిల్లీ ఛలో’.. కేంద్రం స్పందిస్తుందా?

Delhi Chalo Rally To Resume Again  - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రైతుల నిరసన ర్యాలీ ఢిల్లీ ఛలో ఇవాళ(ఫిబ్రవరి 21) మళ్లీ మొదలవనుంది. పలు పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)పై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాలు బుధవారం నుంచి మళ్లీ నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వందలాది ట్రాక్టర్లు, జేసీబీలతో రాజధాని నగరంలోకి చొచ్చుకు వచ్చేందుకు రైతులు సిద్ధమయ్యారు.

అయితే రైతు నాయకులు కేంద్రానికి బుధవారం ఉదయం 11 గంటల దాకా సమయమిచ్చారు. ఈ లోపు ఏదో ఒకటి తేల్చకపోతే ఢిల్లీ ఛలో యథావిధిగా జరుగుతుందని తెలిపారు. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. టిక్రీ, సింగు సరిహద్దులను పోలీసులు పూర్తిగా మూసేశారు. ఈ సరిహద్దుల వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించడమే కాక కాంక్రీట్‌ బారికేడ్‌లను అడ్డుగా ఉంచారు. రైతుల నిరసన ర్యాలీ ఢిల్లీలోకి ప్రవేశిస్తే నగరంలో ట్రాఫిక్‌ గ్రిడ్‌లాక్‌కు దారి తీస్తుందని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. అవసరమైతే ఘాజీపూర్‌ సరిహద్దును కూడా మూసివేస్తామని పోలీసులు తెలిపారు. 

నోయిడా, గురుగ్రామ్‌లలోనూ ట్రాఫిక్‌ ఆంక్షలు పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు గ్రేటర్ నోయిడాలోని నాలెడ్జ్‌ పార్క్‌లో మార్చ్‌ చేసేందుకు రైతులు ఇప్పటికే డిసైడయ్యారు. దీంతో ఇక్కడ ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. కీలకమైన పంజాబ్‌, హర్యానాల సరిహద్దు అయిన శంభు బోర్డర్‌లో భారీగా పోలీసులు మోహరించారు.  హర్యానాలోని 7 జిల్లాలో బల్క్‌ ఎస్‌ఎమ్‌ఎస్‌లతో పాటు ఇంటర్నెట్‌ సర్వీసులను ప్రభుత్వం ఇప్పటికే నిలిపివేసింది.

ర్యాలీ చేసే రైతుల వద్ద ఉన్న జేసీబీ వంటి యంత్రాలను సీజ్‌ చేయాలని పంజాబ్‌ ప్రభుత్వాన్ని హర్యానా ప్రభుత్వం ఇప్పటికే కోరింది. కాగా, ఈ నెల 13న రైతులు మొదటిసారి ఢిల్లీ ఛలోకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత కేంద్రం వారితో చర్చలు జరిపింది. ఈ చర్చలు ఫెయిల్‌ అవడంతో రైతు సంఘాలు మళ్లీ బుధవారం నుంచి ఛలో ఢిల్లీ ర్యాలీ పునరుద్ధరిస్తామని  ప్రకటించారు. 

బీజేపీ, ఎన్డీఏ  ఎంపీల ఇళ్ల ముందు నల్ల జెండాలు..

ఢిల్లీ ఛలోతో పాటు బీజేపీ, ఎన్డీఏ ఎంపీల ఇళ్ల ముందు నల్ల జెండాలతో నిరసన తెలపాలని రైతుల ఐక్య వేదిక సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎమ్‌) పిలపునిచ్చింది. ఇక పంజాబ్‌లోని బీజేపీ నేతల ఇళ్లను ముట్టడిస్తామని ఎస్‌కేఎమ్‌ ఇప్పటికే ప్రకిం‍చింది. దీంతో బీజేపీ నేతల ఇళ్ల ముందు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. 

ఇదీ చదవండి.. మరాఠాల రిజర్వేషన్‌కు ఓకే 

whatsapp channel

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top