హైవేపై ట్రక్కులు ఢీ.. సిలిండర్లు పేలుళ్ల ధాటికి మంటలు.. | Cylinder Truck Accident At Rajasthan Jaipur-Ajmer Highway | Sakshi
Sakshi News home page

హైవేపై ట్రక్కులు ఢీ.. సిలిండర్లు పేలుళ్ల ధాటికి మంటలు..

Oct 8 2025 7:52 AM | Updated on Oct 8 2025 8:57 AM

Cylinder Truck Accident At Rajasthan Jaipur-Ajmer Highway

జైపూర్‌: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్లను తీసుకెళుతున్న ట్రక్కు మరో ట్రక్కును ఢీకొట్టింది. ఈ క్రమంలో హైవేపై భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ప్రమాదం కారణంగా గ్యాస్‌ సిలిండర్లు పేలిపోయి ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఈ ఘటనతో సమీపంలోని వాహనాలు సైతం దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని జైపూర్‌-అజ్మేర్‌ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ఎల్‌పీజీ సిలిండర్లను తీసుకువెళ్తున్న ట్రక్కు, మరో ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం ధాటికి మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. కారణంగా సమీపంలోని వాహనాలు సైతం దెబ్బతిన్నాయి. కొన్ని కిలోమీటర్ల మేర పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. పేలుడు ఘటనతో రహదారిపై భారీ ట్రాఫిక్‌ జామ్‌ అయింది. మంటలు ఎగిసిపడుతుండంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

మరోవైపు.. ఈ ప్రమాద ఈ ఘటనపై రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌ శర్మ ఆరా తీశారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని డిప్యూటీ సీఎం ప్రేమ్‌చంద్‌ బైర్వాను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయన ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనలో రెండు ట్రక్కుల డ్రైవర్లు, క్లీనర్లు కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. వారి జాడ కోసం పోలీసులు వెతుకుతున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదని తెలుస్తోంది. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement