పెరిగిన కరోనా మరణాలు | Covid-19: India logs 16326 fresh Covid cases, 666 deaths | Sakshi
Sakshi News home page

పెరిగిన కరోనా మరణాలు

Oct 24 2021 6:20 AM | Updated on Oct 24 2021 6:20 AM

Covid-19: India logs 16326 fresh Covid cases, 666 deaths - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌–19 కారణంగా ఒక్క రోజులో మరణించిన వారి సంఖ్యలో ఒక్కసారిగా పెరుగుదల నమోదైంది. శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఒక్కరోజులో మహమ్మారి కారణంగా 666 మంది మృతి చెందారు. కేరళ ప్రభుత్వం గతంలో సంభవించిన 292 మరణాలను తాజాగా నమోదుచేయడంతో ఈ  పెరుగుదల కనిపించింది. ఇప్పటివరకు దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,53,708కి చేరుకుంది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,73,728కి తగ్గగా, గత 24 గంటల్లో 16,326 కొత్త కేసుకోవిడ్‌–19, మరణాలు, కేంద్ర ఆరోగ్య శాఖలు నిర్ధారణయ్యాయి. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో101.30 కోట్ల టీకా డోస్‌లు ఇచ్చారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement