భారత్‌లో నాలుగువేలకు పైగా కోవిడ్‌ కేసులు.. ఐదుగురి మృతి | Covid 19 Cases in India past 4000 | Sakshi
Sakshi News home page

భారత్‌లో నాలుగువేలకు పైగా కోవిడ్‌ కేసులు.. ఐదుగురి మృతి

Jun 3 2025 5:10 PM | Updated on Jun 3 2025 5:58 PM

Covid 19 Cases in India past 4000

న్యూఢిల్లీ: కోవిడ్‌-19 భారత్‌లో అంతకంతకూ విజృంభిస్తోంది. కోవిడ్‌ ప్రస్తుతం పాండమిక్‌ కాదు.. ఎండమిక్‌ అని ఆరోగ్య సంస్థలు చెబుతున్నప్పటికీ ఆ మహమ్మారి విజృంభిస్తున్న తీరును చూస్తే జనాల్లో ఆందోళన కలుగుతోంది. ఈరోజు(మంగళవారం, జూన్‌ 3) భారత్‌లో కోవిడ్‌ కేసుల సంఖ్య నాలుగు వేలు దాటింది. ప్రస్తుతం భారత్‌ నాలుగు వేల ఇరవై ఆరు కేసులు ఉన్నట్లు ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.  

తాజాగా ఐదుగురు కోవిడ్‌తో మృతి చెందినట్లు స్పష్టం చేసింది.  మహారాష్ట్రలో ఇద్దరు, తమిళనాడు, యూపీ, కేరళలలో ఒక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. కేరళలో అత్యధికంగా 1416 కేసులు నమోదు కాగా,  అటు తర్వాత  అత్యధికంగా కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. మహారాష్ట్రలో 494 కేసులు నమోదయ్యాయి ఇక గుజరాత్‌లో 397, ఢిల్లీలో 393 కేసులు, తమిళనాడులో 215 కేసులు ఉన్నాయి. ఇక ఏపీలో 28 కేసులో వెలుగు చూడగా, తెలంగాణలో  4 కోవిడ్‌ కేసులు ఉన్నాయి.  గత కొన్ని రోజులుగా కర్ణాటకలో, హర్యానా, తమిళనాడు, గుజరాత్‌లలో కోవిడ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది.  అయితే అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. 

అయితే భారత్‌లో కోవిడ్‌ కేసులు పెరుగుదలకు ప్రపంచంలోని పలు దేశాల్లో  ఈ వైరస్‌ కోరలు ఇంకా సజీవంగా ఉండటమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం కోవిడ్‌ సోకిన వారిలో కొద్ది పాటి లక్షణాలు మాత్రమే ఉంటున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement