CoronaVirus Live Updates: 58097 New Covid Positive Cases Reported In India - Sakshi
Sakshi News home page

విజృంభిస్తున్న కరోనా.. దేశంలో కొత్తగా కేసులు ఎన్నంటే..

Jan 5 2022 9:55 AM | Updated on Jan 5 2022 10:31 AM

Coronavirus: 58097 New Covid Positive Cases Reported In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 58,097 కరోనా పాజిటివ్‌ నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. అదే విధంగా గడిచిన 24 గంటల్లో 534 మంది కరోనాతో మరణించారు.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3,43,21,803 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా బరినపడి 4,82,551 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 2,14,004 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం కోవిడ్‌ రోజువారి పాజిటివ్ రేటు 4.18 శాతంగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement