
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,66,161 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 2,26,62,575కు చేరింది. గడిచిన 24 గంటల్లో 3,754 మంది కరోనా బాధితులు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,46,116 మంది మృతి చెందారు.
గత 24 గంటల్లో కరోనా నుంచి వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకుని 3,53,818 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 1,86,71,22 కరోనా బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 37,45,237 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 17.01కోట్ల మందికి వ్యాక్సిన్ అందించారు.
చదవండి: కరోనా కల్లోలం: ఖాళీ అవుతున్న బెంగళూరు!