కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్స్, ప్రచార కమిటీ సభ్యులు వీరే | Congress Appoints Working presidents and Campaign Committee in Karnataka | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్స్, ప్రచార కమిటీ సభ్యులు వీరే

Mar 23 2024 9:22 PM | Updated on Mar 23 2024 9:23 PM

Congress Appoints Working presidents and Campaign Committee in Karnataka - Sakshi

కాంగ్రెస్ హైకమాండ్ శనివారం 'కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ' (KPCC)కి ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ముగ్గురు సభ్యులతో ప్రచార కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌లుగా తన్వీర్ సైత్ (మైసూరు ఎమ్మెల్యే), జీసీ చంద్రశేఖర్ (ఎంపీ), వినయ్ కులకర్ణి (ధార్వాడ్ ఎమ్మెల్యే), మంజునాథ్ భండారి (ఎమ్మెల్సీ), వసంత్ కుమార్ నియమితులయ్యారు. 

ప్రచార కమిటీలో చైర్మన్ వినయ్ కుమార్ సొరకే (మాజీ మంత్రి), కో చైర్మన్ డాక్టర్ ఎల్ హనుమంతయ్య (ఎంపీ), వైస్ చైర్మన్ రిజ్వాన్ అర్షద్ (శివాజీనగర్ ఎమ్మెల్యే) ఉన్నారు. కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో 2024 ఏప్రిల్ 26, మే 7న రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement