ఎన్డీయేలోకి ఎల్జేపీ (రామ్‌విలాస్‌)! | Chirag Paswan Indicates Potential Joining Of BJP-Led NDA | Sakshi
Sakshi News home page

ఎన్డీయేలోకి ఎల్జేపీ (రామ్‌విలాస్‌)!

Jul 10 2023 5:06 AM | Updated on Jul 10 2023 8:36 AM

Chirag Paswan Indicates Potential Joining Of BJP-Led NDA - Sakshi

పట్నా: బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే)లో బిహార్‌కు చెందిన లోక్‌ జనశక్తి పారీ్ట(రామ్‌ విలాస్‌) భాగస్వామిగా చేరేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ నేత, ఎంపీ చిరాగ్‌ పాశ్వాన్‌తో కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు నిత్యానంద రాయ్‌ తాజాగా చర్చలు జరిపారు. బీజేపీ, దివంగత రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ ఒకే విలువలను పంచుకొనేవారని గుర్తుచేశారు.

ప్రజా సాధికారతతోపాటు అభివృద్ది కోసం పాశ్వాన్‌ ఎంతగానో తపించేవారని కొనియాడారు. అయితే, ఎన్డీయేలో లోక్‌ జనశక్తి పారీ్ట(రామ్‌ విలాస్‌) చేరికపై నిత్యానంద రాయ్‌ నేరుగా స్పందించలేదు. చిరాగ్‌ పాశ్వాన్‌ మాట్లాడుతూ.. బీజేపీతో మరో దఫా చర్చలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఎన్డీయేలో చేరికపై ఇప్పుడే స్పందించడం సరైంది కాదన్నారు. బీజేపీపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తన అభిమానాన్ని ఆయన గతంలో పలుమార్లు చాటుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement