కేంద్రానిది ఆర్థిక ఉగ్రవాదం: టీఎంసీ | Centre indulging in fiscal federal terrorism says Trinamul mp | Sakshi
Sakshi News home page

కేంద్రానిది ఆర్థిక ఉగ్రవాదం: టీఎంసీ

Feb 5 2024 6:15 AM | Updated on Feb 5 2024 6:15 AM

Centre indulging in fiscal federal terrorism says Trinamul mp - Sakshi

కోల్‌కతా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పశ్చిమబెంగాల్‌ అధికార పార్టీ టీఎంసీ విరుచుకుపడింది. కేంద్రం ఆర్థిక సమాఖ్య ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఒబ్రియాన్‌ ఆదివారం కోల్‌కతాలో మీడియాతో మాట్లాడారు.

తామిచ్చే నిధుల వినియోగానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను బెంగాల్‌ ప్రభుత్వం అందజేయలేదంటూ కేంద్రం చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని ఆయన కొట్టిపారేశారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే పార్టీ అధికారంలో ఉన్నందునే రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి విమర్శలు చేస్తోందని ఎంపీ ఒబ్రియాన్‌ అన్నారు. కాగ్‌ నివేదికలోని అంశాలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తూ వ్యతిరేక ప్రచారానికి బీజేపీ ప్రభుత్వం పూనుకుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement