పబ్‌లో సీఐ రచ్చ.. సస్పెండ్‌ | CCB Police Inspector Suspended for Misconduct at Pub, Video Goes Viral | Sakshi
Sakshi News home page

పబ్‌లో సీఐ రచ్చ.. సస్పెండ్‌

Aug 20 2025 11:14 AM | Updated on Aug 20 2025 11:38 AM

 ccb inspector suspend in karnataka

కర్ణాటక: పబ్‌లో మద్యం కైపులో ఆయిల్‌ పోసి గొడవ చేసినందుకు సిసిబి ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌కుమార్‌ను పోలీస్‌ కమిషనర్‌ సీమా లట్కర్‌ సస్పెండ్‌ చేశారు. చాముండి హిల్స్‌ దిగువన ఉన్న జేసీ నగరలోని ఒక పబ్‌కు వెళ్లిన మోహన్‌కుమార్‌ తాగిన మత్తులో సిబ్బందితో గొడవపడ్డాడు. వారి మీదకు వెళ్తూ, గట్టిగా అసభ్యంగా తిడుతూ హల్‌చల్‌ చేశాడు. నూనె బాటిల్‌ను తీసుకుని  ఒలకబోశాడు. ఈ వీడియోలు వైరల్‌ అయ్యాయి. సీఐ అరాచకం అంతటా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా చర్యల కింద అతనిని కమిషనర్‌ సస్పెండ్‌ చేశారు.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement