ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ స్కామ్‌లో ఆరుగురు ఐఏఎస్‌లపై కేసు | CBI files chargesheet against 13 accused including six IAS Officers | Sakshi
Sakshi News home page

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ స్కామ్‌లో ఆరుగురు ఐఏఎస్‌లపై కేసు

Sep 3 2026 6:04 AM | Updated on Sep 3 2026 6:04 AM

CBI files chargesheet against 13 accused including six IAS Officers


మరో 13 మంది పైనా అభియోగాలు నమోదు

న్యూఢిల్లీ: హరియాణా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నగదు నిల్వలను అక్రమంగా విత్‌డ్రా చేసి పలు కంపెనీలు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థల ఖాతా ల్లోకి మళ్లించిన ఉదంతంలో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై బుధవారం ఆరుగురు హరియా ణా కేడర్‌ ఐఏఎస్‌లపై సీబీఐ అభియోగాలు నమోదుచేసింది. ప్రభుత్వ విభాగాలు, సంస్థల కు సంబంధించిన రూ.504 కోట్ల నగదు నిల్వ లను కాజేసిన ఉదంతంలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌కు చెందిన ముగ్గురు అధికారులతోపాటు ఏ యూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌కు చెందిన మరొకరి పైనా సీబీఐ అధికారులు చార్జ్‌షీట్‌ నమోదు చేశారు.

 పంచకులలోని ప్రత్యేక కోర్టులో సీబీఐ ఈ మేరకు మూడో అనుబంధ చార్జ్‌షీట్‌ను దాఖలుచేసింది. 13 మంది హరియాణా ప్రభు త్వ ఉన్నతాధికారుల పేర్లను చార్జ్‌షీట్‌లో జత చేసింది. నేరపూరిత కుట్ర, మోసం, సాక్ష్యాధారా లను నాశనంచేయడం, ఫోర్జరీ, నగదు విత్‌డ్రా కోసం నకిలీ చెక్‌ బుక్‌లు, తప్పుడు డాక్యుమెంట్లు తయారుచేయడం, బ్యాంక్‌ ఖాతాలోని నగదు మొత్తాలను తప్పుగా చూపడం, నమ్మక ద్రోహం, ముడుపులు తీసుకోవడం, నేరపూరిత ప్రవర్తన తదితర నేరాలకుగాను భారతీయ న్యాయ సంహిత చట్టాల్లోని పలు సెక్షన్ల కింద వీళ్లపై అభియోగాలు నమోదుచేశారు. 

పంచాయతీ, మున్సిపల్‌ కార్పొరేషన్, స్కూల్‌ శిక్షా పరియోజనా పరిషత్, కార్మిక సంక్షేమం, వ్యవసాయ మార్కెటింగ్‌ బోర్డ్‌ ఇలా హరియణా ప్రభుత్వంలోని ఆరు శాఖలు, విభాగాలకు చెందిన నగదు లావాదేవీల కోసం హరియాణా సర్కార్‌ ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌కు చెందిన చండీగఢ్‌ బ్రాంచీలోని తన ఖాతాను ఉపయోగిస్తోంది. ఇందులో వందల కోట్ల రూపాయలున్నాయి. అయితే ఈ ఖాతా వివరాలను దొంగచాటుగా తెల్సుకున్న ఆ బ్రాంచ్‌ మేనేజర్‌ రిభవ్‌ రిషీ, మాజీ బ్యాంక్‌ రిలేషన్‌షిప్స్‌ మేనేజర్‌ అభయ్‌ కుమార్‌ ఈ కుట్రకు తెరతీశారు. 

రిషి భార్య స్వాతి, బామమరిది అభిషేక్‌లకు చెందిన కంపెనీల్లోకి ఈ ఖాతా నగదు నిల్వలను కొద్దికొద్ది గా తరలించడం మొదలెట్టారు. స్వాతికి చెందిన స్వస్తిక్‌ దేశ్‌ ప్రొడక్ట్స్‌లోకిఏకంగా రూ.300 కోట్లు బదిలీచేశారు. ఇటీవలికాలంలో ప్రభుత్వం ఈ బ్రాంచ్‌లోని తమ అకౌంట్‌ను శాశ్వతంగా మూ సేసి నగదును వేరే బ్యాంక్‌లోకి మార్చాలని భా వించింది. పుస్తకాల్లోని నగదుకు, వాస్తవ నగదు కు భారీ వ్యత్యాసం ఉండటంతో ఈ కుంభకో ణం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన హరియాణా అవినీతి నిరోధక శాఖకేసు నమోదుచేసింది. తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్ట రేట్‌ సైతం 19 చోట్ల సోదాలుచేసి కీలక డాక్యు మెంట్లను స్వాధీనంచేసుకుంది. రిభవ్‌ రిషీ, అభయ్‌ తదితరులను ఇప్పటికే అరెస్ట్‌చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement