కూలిన మరో ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ రూఫ్‌.. మూడు రోజుల్లో రెండో ఘ‌ట‌న‌ | Canopy Outside Rajkot Airport Terminal Collapses Amid Heavy Rain | Sakshi
Sakshi News home page

కూలిన మరో ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ రూఫ్‌.. మూడు రోజుల్లో రెండో ఘ‌ట‌న‌

Jun 29 2024 2:00 PM | Updated on Jun 29 2024 3:30 PM

Canopy Outside Rajkot Airport Terminal Collapses Amid Heavy Rain

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో టెర్మినల్ రూఫ్ ఘటనను మరిచిపోకముందే గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్‌ ఎయిర్‌పోర్ట్‌లనూ ఇలాంటి ప్ర‌మాదమే జరిగింది.

భారీ వ‌ర్షం కార‌ణంగా రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ వెలువ‌ల ఉన్న పైకప్పు శ‌నివారం కుప్ప కూలిపోయింది. ప్రయాణికుల పికప్, డ్రాప్ పాయింట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్ర‌మాదంలో ఎవ‌రికి ఎలాంటి గాయాలు అవ్వ‌లేదు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

 కాగా శుక్ర‌వారం ఉద‌యం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మిన‌ల్ 1 వ‌ద్ద పైక‌ప్పు కూలిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా ఆరుగురు తీవ్రంగా గాయపడిన విష‌యం తెలిసిందే. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ‌బ‌ల్‌పూర్‌లో ఇలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకుంది. దుమ్నా ఎయిర్‌పోర్టులో భారీ వ‌ర్షాల కార‌ణంగా టెర్మిన‌ల్‌ రూప్ ప‌డిపోయింది.

 

కాగా గుజరాత్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వాతావ‌ర‌ణ శాఖ తుఫాన్ హెచ్చరికలు జారీ చేసిందిశ‌నివారం దక్షిణ గుజరాత్‌కు  'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరో ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement